బీహార్లో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ మళ్లీ నిర్వహించాలని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా డిమాండ్ చేశారు. తమ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు 89 లక్షల అక్రమాలకు సంబంధించిన ఫిర్యాదులను గుర్తించారని, కానీ ఈసీ అన్నింటినీ తిరస్కరించిందని ఆరోపించారు. SIRలో బయటపడిన అక్రమాలు ఈసీ చర్యలపై సందేహాలు కలిగిస్తున్నాయని, కాబట్టి ఈ ప్రక్రియను మళ్లీ చేపట్టాలని కోరారు.