MBNR: వచ్చే నెల 3న మూసాపేటకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. మూసాపేటలో నిర్మాణాలు పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలకు హాజరు కానున్నారు. ఇందులో భాగంగా దేవరకద్రలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి మూసాపేట గ్రామస్తులతో సమావేశమయ్యారు. మూసాపేటలో చివరి దశలో ఉన్న ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని లబ్ధిదారులకు సూచించారు.