TG: మాజీ CM KCR, మాజీ మంత్రి హరీష్రావు అక్రమాలు చేస్తుంటే.. MP ఈటల రాజేందర్ కళ్లు మూసుకున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. ‘కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే సంక్షేమం అందిస్తున్నాం. పేపర్లు, TVలు పెట్టడానికి వారికి డబ్బులు ఎలా వచ్చాయి. KCR కుటుంబానికి వేలకోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో ప్రజలకు చెప్పండి. ఆటెక్నిక్ ఏంటో చెబితే ప్రజలు కూడా బాగుపడతారు కదా?’ అని అన్నారు.