AP: గుంటూరులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని సైకిల్ స్టాండ్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.