AP: నెల్లూరులో ఆర్777 బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ మహేష్ బాబు, హరికృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ వ్యక్తిని రూ.53 లక్షలు మోసం చేయడంతో దర్యాప్తు చేపట్టి, వారి ఖాతాల్లోని రూ.1.64 కోట్లను సీజ్ చేశారు. దుబాయ్, శ్రీలంకలో శిక్షణ పొందిన మహేష్.. అక్కడి నుంచే యాప్ లింకులు పొంది ఈ దందా నడుపుతున్నాడు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.