Manchu Manoj:మంచు మనోజ్ (Manchu Manoj) తన నోటి దురుసును ప్రదర్శించారు. మీడియా (media) ప్రతినిధులపై విరుచుకుపడ్డారు. ఇటీవల మనోజ్ సోదరుడు విష్ణుతో (vishnu) గొడవ జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి బయట ఎప్పుడూ కలిసిన.. ఇదే విషయాన్ని మీడియా ప్రస్తావిస్తుంటుంది. ఈ రోజు కూడా అలా ప్రస్తావించగా.. అసహనం వ్యక్తం చేశారు.
ఇటీవల భూమా మౌనికను (mounika) మనోజ్ (manoj) పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లిలో కూడా విష్ణు (vishnu) అంటిముట్టనట్టుగానే వ్యవహరించారు. తర్వాతే గొడవ జరిగింది. మనోజ్ (Manoj) మేనేజర్‌పై విష్ణు (vishnu) దాడి చేశాడు. ఇదీ ఫేక్ అని తెలిసింది. ఈ రోజు మనోజ్ (Manchu Manoj) కుటుంబ సమేతంగా తిరుపతి (tirupati) వచ్చారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత తాజా పరిణామాలపై స్పందించాలని మీడియా ప్రతినిధులు కోరారు.
కోపగించుకున్న మనోజ్ (manoj).. సెగ్గడ్డ వచ్చిందండి.. గోకుతారా..? అదే రీసెంట్ ఇష్యూ అని సెటైర్లు వేశారు. ఒక్కసారిగా మనోజ్ (Manoj) ఇలా అనడంతో అక్కడున్న రిపోర్టర్లు ఆశ్చర్యపోయారు. ఇదేంటి ఇలా అన్నారని వాపోయారు. అన్న దాడి చేశాడని చెబితే.. మీడియా వార్తలు రాయాలి.. గొడవ సద్దుమణిగిన తర్వాత ఇలా వ్యవహరిస్తారా అని అడిగారు.
మనోజ్ (Manchu Manoj) వ్యవహారశైలిని సీనియర్ జర్నలిస్టులు ఖండించారు. ఇదీ మంచి పద్దతి కాదు.. క్షమాపణ చెప్పాలని కోరారు. ఫోర్త్ ఎస్టెట్ అయిన మీడియాపై ఇలా మాట్లాడటం సరికాదని మండిపడ్డారు.