ELR: జిల్లాలో యూనియన్ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా యువతకు వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ సంచాలకుడు ఎం. ఫణి కిశోర్ తెలిపారు. యువకులకు ఫోన్ల మరమ్మతులలో 30 రోజులు, యువతులకు జనపనార సంచుల తయారీలో శిక్షణ ఇస్తామని వివరించారు. పూర్తి వివరాలకు 9948565256 నెంబర్ను సంప్రదించాలని ఫణికిశోర్ సూచించారు.