ASR: కూటమి ప్రభుత్వంతోనే గిరిజన ప్రాంతం అభివృద్ధి సాధ్యపడుతుందని రాష్ట్ర GCC ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ తెలిపారు. సోమవారం డుంబ్రిగుడ మండలం శుక్రపుట్టు గ్రామంలో నిర్వహించిన సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో ఆయన ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. గిరిజనుల గడపగడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు గురించి వివరించారు.