CTR: స్వర్ణాంధ్ర విజన్ – 2047లో భాగంగా తిరుపతి కలెక్టరేట్ జిల్లా విజన్ ఆక్షన్ ప్లాన్ సమావేశం సోమవారం జరిగింది. ఛైర్మన్ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో పెండింగ్ పనులతో పాటు కొత్త అభివృద్ధి పనులు చేర్చినట్లు తెలిపారు. సత్యవేడు నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా కీలక కార్యక్రమాలు పొందుపరిచామని ఎమ్మెల్యే ఆదిమూలం చెప్పారు.