GNTR: గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన “ప్రజా ఫిర్యాదులు – పరిష్కారాల వ్యవస్థ” కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ప్రజలకు భరోసా ఇచ్చారు. చట్ట పరిధిలో వారి సమస్యలకు తగిన పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన ప్రజల నుండి ఫిర్యాదులను పోలీసు అధికారులు స్వీకరించారు.