W.G: భీమవరం కలెక్టరేట్లో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 165 అర్జీలు అందాయని, వాటిని సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి, డీఆర్వో వెంకటేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు.