NDL: ప్రజా సమస్యలను నాణ్యతతో మెరుగైన రీతిలో పరిష్కరించేలా బాధ్యతగా కృషి చేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని PGRS హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి అర్జీలను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్వోలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.