GNTR: తాడేపల్లి కొత్తూరులోని కె.వి.ఆర్ వాటర్ ప్లాంట్ పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ చుట్టూ చెత్తాచెదారాలు పేరుకుపోయి ప్రమాదకరంగా మారింది. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఎప్పుడైనా అగ్నిప్రమాదం సంభవించవచ్చని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి చెత్త తొలగించి, భవిష్యత్లో చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.