ATP: అంబికా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనంతపురంలో జూలై 12న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. ఆర్. కన్వెన్షన్ హాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మేళా జరుగుతుందన్నారు. 750కుపైగా ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.