SKLM: కూటమి ప్రభుత్వం ఏడాదిపాలనలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్నామని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. సోమవారం మెలియాపుట్టి మండలంలోని ముక్తాపురం గ్రామంలో ”సుపరిపాలన లో తొలి అడుగు” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.