అన్నమయ్య: రామచంద్రపురం మండల పరిధిలోని నెత్తకుప్పం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కృష్ణయ్య మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పులివర్తి నాని సోమవారం గ్రామానికి చేరుకుని కృష్ణయ్య మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.