KDP: రక్తదానం చేస్తే మరొకరికి ప్రాణం ఇవ్వవచ్చని జిల్లా బీజేపీ అధ్యక్షుడు వెంకటసుబ్బారెడ్డి పేర్కొన్నారు. నెహ్రూ యువ కేంద్రం మై భారత్ ఆధ్వర్యంలో రక్తదాన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. నగరంలోని రెడ్ క్రాస్ కార్యాలయం, రిమ్స్ ఆసుపత్రి, ప్రభుత్వ కాలేజీ ప్రాంగణాలలో జూలై 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు రక్తదాన శిబిరాలు జరుగుతాయన్నారు. ఆసక్తి ఉన్నవారు రక్తదానం చేయాలని కోరారు.