BTP: సంతమాగులూరు మండలంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సోమవారం ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించి, పండించిన ఆహార ఉత్పత్తులు తినడం వల్ల ప్రజలు రోగాల బారిన పడకుండా ఉండడంతో పాటు దీర్ఘకాలంలో పర్యావరణం దెబ్బ తినకుండ ఉంటుందన్నారు.