BDK: అశ్వాపురం మండలం జగ్జీవన్ రామ్ కాలనీలో సోమవారం MRPS ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా MRPS నాయకులు ఈసంపల్లి కృష్ణ జెండా ఆవిష్కరించారు. అనంతరం మాదిగ అమరవీరులను స్మరించుకున్నారు. వారు మాట్లాడుతూ.. గత 30 ఏళ్లుగా ఏ, బీ, సీ, డీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ నాయకత్వంలో అనేక పోరాటాలు చేశామని పేర్కొన్నారు.