MBNR: కాంగ్రెస్ ప్రభుత్వం ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన నియోజకవర్గాలకు మొత్తం 8,750 ఇళ్లు మంజూరు చేసినట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,319 ఇళ్లు శాంక్షన్ చేసినట్లు తెలిపింది. ఈ లబ్ధిదారులకు సోమవారం ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అచ్చంపేటలోని మున్ననూర్లో మంజూరు పత్రాలను ఇవ్వనున్నారు.