VSP: పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు సీఐ కెవి సతీష్ కుమార్ సారధ్యంలో ఎస్సై స్వామి నాయుడు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆదివారం పలు ప్రాంతాలకు చెందిన రౌడీ షీటర్లను పిలిపించి మంచి ప్రవర్తనతో నడుచుకోవాలని సూచించారు. నడవటికలో పరివర్తనలో మార్పు రాకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు.