కృష్ణా: బాపులపాడులో శ్రీ భ్రమరాంబ సమేత శ్రీశైల మల్లికార్జున స్వామి దేవస్థానం ప్రాంగణంలో నిర్మాణం జరుగుతున్న శ్రీ అయ్యప్ప స్వామి ఆలయానికి దాతలు విరాళాలు అందజేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం మండల వెంకట సత్యనారాయణ మూర్తి, లక్ష్మీ రంగనాయకమ్మ దంపతులు రూ.5,09,000 విరాళం ఆలయ కమిటీకి అందించారు. అయ్యప్ప స్వామి వారి కుటుంబాన్ని కాపాడాలని ఆలయ కమిటీ ఆకాంక్షించారు.