TG: మాజీ సీఎం కేసీఆర్‌తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ మేరకు ఇవాళ ఆయన మధ్యాహ్నం ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది.