నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్(MANAGE)లో 3 అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి గడువు ఇవాళ్టితో ముగియనుంది. పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం గల 35 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉండనుండగా.. జీతంగా నెలకు రూ.57,700-1,82,400 చెల్లిస్తారు.