SDPT: వరకట్న వేధింపులు భరించలేక ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జగదేవపూర్ (M) చాట్లపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై చంద్రమోహన్ వివరాలు.. జనగామ మండలం వెంకిర్యాలకి చెందిన శిరీష(21)కి చాట్లపల్లికి చెందిన వంశీధర్తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వంశీధర్ అదనపు కట్నం కోసం వేధిస్తుండడంతో మంగళవారం మనస్తాపానికి గురైన శిరీష సూసైడ్ చేసుకుంది.