KKD: ప్రముఖ పుణ్యక్షేత్రం లోవ తపులమ్మతల్లికి ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ. 4,98,249 ఆదాయం సమకూరినట్లు ఈవో విశ్వనాథరాజు తెలిపారు. ఆదివారం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అమ్మవారిని 15 వేల మంది భక్తులు దర్శించుకున్నారని పేర్కొన్నారు. భక్తులు చెల్లించిన కానుకల ద్వారా రూ. 4,98,249ల ఆదాయం వచ్చిందన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయం వద్ద ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.