MNCL: జన్నారం మండలం మహమ్మదాబాద్లో కురిసిన భారీ ఈదురుగాలులకు చెట్టు తలపై పడి సునీత అనే మహిళ (37) మృతి చెందినట్లు జన్నారం ఎస్సై రాజావర్ధన్ గురువారం తెలిపారు. దండేపల్లి నుంచి జగన్ అతడి భార్య సునీత కడెం మండలానికి వెళ్లి వస్తుండగా గాలివాన రావడంతో చెట్టుకింద ఆగారు. ఆ సమయంలో ఈ ఘటన జరిగిందన్నారు. జగన్ స్వల్ప గాయాలపాలై చికిత్స పొందుతున్నాడన్నారు.