ASF: రెబ్బెన మండలంలో శుక్రవారం రాత్రి పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. కాగజ్ నగర్ X రోడ్ వద్ద బైక్‌ను అతివేగంగా నడిపిన ఏ.అంజిరెడ్డిపై కేసు నమోదు చేశారు. అలాగే రెబ్బెన PHC సమీపంలో బైక్‌పై ట్రిపుల్ రైడింగ్ చేస్తూ నిర్లక్ష్యంగా వెళ్తున్న పోగుల శ్రీకాంత్‌పై కూడా చర్యలు తీసుకున్నామని SI వెంకటకృష్ణ తెలిపారు. ట్రిపుల్ రైడింగ్ చట్ట విరుద్ధమన్నారు.