KDP: వల్లూరు మండల పరిధిలోని కొప్పోలి బస్టాండ్ సమీపాన బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికల వివరాల ప్రకారం.. స్థానికంగా ఉన్న ఇటికల బట్టిలలో పనిచేస్తున్న చరణ్ నడుచుకుంటూ వెళ్తుండగా.. బైక్ ఢీకొట్టింది. దీంతో అతడికి, బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు వారిని కడప రిమ్స్‌కు తరలించారు.