సత్యసాయి: కోల్కత్తా రాష్ట్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ దక్షిణేశ్వర కాళికామాతను మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పుణ్యక్షేత్రంలో కాళికామాతకు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్, భర్త చరణ్ రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ఆమె తెలిపారు.