ATP: గుత్తి కోట వీధిలోని అతి పురాతనమైన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. ఆలయం ఎదురుగా ఉన్న బెనకాల బావిలో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు శ్రీధర్ మాట్లాడుతూ.. సకాలంలో వర్షాలు కురవాలని ఈ గంగమ్మ పూజలు నిర్వహిస్తున్నామన్నారు.