ADB: ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు చదవడం, రాయడం, సాధారణ గణిత ప్రక్రియలపై పరిజ్ఞానంతో పాటు అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలని మండల విద్యాశాఖ అధికారి శ్యాంసుందర్ అన్నారు. 5 రోజులపాటు నిర్వహించనున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని భీంపూర్ మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించారు. ఉపాధ్యాయులు, రిసోర్స్ పర్సన్స్, సీఆర్పీలు తదితరులున్నారు.