BPT: అక్రమ కార్యకలాపాలను నియంత్రించేందుకు జిల్లా ఎస్పీ తుషార్ దూడి ఆదేశాల మేరకు పోలీసులు హోటళ్లు, రిసార్టులు, దాబాలపై మంగళవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అతిథుల వివరాలను సరిచూసుకోవాలని, అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే నివేదించాలని ఎస్పీ సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.