ELR: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. పెదవేగి మండలం దుగ్గిరాలలో నియోజకవర్గంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఎమ్మెల్యే చింతమనేనిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే సత్వరమే వాటిని పరిష్కరిస్తామన్నారు.