ఆంధ్ర ప్రదేశ్ లో (Andhra Pradesh) ముందస్తు ఎన్నికలు (Pre Poll Elections) ఉండబోవని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి (Chief Minister of Andhra Pradesh YS Jagan Mohan Reddy) స్పష్టం చేశారని ఐటీ శాఖ మంత్రి (IT Minister) గుడివాడ అమర్నాథ్ (gudivada amarnath) తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం (Gadapa Gadapaku Mana prabhutwam) కార్యక్రమం పైన సమీక్షలో భాగంగా ఎమ్మెల్యేలు (MLAs), మంత్రులు (Ministers), ఇంచార్జులతో (Incharges) అధినేత సమావేశమయ్యారు. సమావేశం అనంతరం మంత్రి అమర్నాథ్ (Minister Amarnath) మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 87 శాతం మందికి ప్రభుత్వం నుండి లబ్ధి చేకూరిందని, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి (Chief Minister) ఆదేశించినట్లు తెలిపారు. గడప గడపకు కార్యక్రమం (Gadapa Gadapaku mana Prabhutwam) ద్వారా నెలలో ఇరవై రోజులు ప్రజల్లో తిరగాలని ఆదేశించారని చెప్పారు. అలాగే సీటు ఇవ్వకుంటే ఇతర పదవులతో న్యాయం చేస్తానని ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారన్నారు. మంత్రి వర్గ విస్తరణ మార్పులపై (Cabinet Reshuffle) సమావేశంలో ఎలాంటి చర్చ జరగలేదని, అదంతా తప్పుడు ప్రచారం అన్నారు.
ఏడాదిలో మనం ఎన్నికలకు వెళ్తున్నామని, కేడర్ క్రియాశీలకంగా ఉండాలని అంతకుముందు జగన్ సమీక్షలో (YS Jagan meeting with MLAs, ministers) అన్నారు. సోషల్ మీడియా (Social Media) ప్రచారం పైన దృష్టి సారించాలన్నారు. ప్రతి లబ్ధిదారును మనం ప్రచారకర్తగా వినియోగించుకోవాలన్నారు. 25 మంది ఎమ్మెల్యేలు వారి పని తీరులో వెనుకబడి ఉన్నారని, ఏ ఒక్క ఎమ్మెల్యేను పోగొట్టుకోవాలని తాను అనుకోవడం లేదన్నారు. పని తీరులో వెనుకబడిన వారు గ్రాఫ్ పెంచుకోవాలని, ప్రజల్లో మంచి పేరు లేకుంటే పార్టీకి, కేడర్ కు నష్టమని చెప్పారు. సగం సచివాలయాల్లో గడప గడపకు కార్యక్రమం పూర్తయిందని, మిగతా వారు 5 నెలల్లో పూర్తి చేయాలన్నారు. నెలకు 20 నుండి 25 రోజుల చొప్పున సచివాలయా