NTR: కంచికచర్ల పంచాయతీలో డివిజనల్ పంచాయతీ అధికారి రఘు మంగళవారం మాట్లాడారు. ఇంటి పన్నుల వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించామన్నారు. ఈ నెల 15 నాటికి 100% పన్ను వసూళ్లు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఐదేళ్ల మొండి బాకాయిలకు నోటీసులు జారీ చేసి, అవసరమైతే ట్యాప్ కనెక్షన్లు నిలిపివేస్తామని హెచ్చరించారు.