GDWL: జిల్లాలోని ఇటిక్యాల మండలంలోని ఎర్రవల్లి చౌరస్తా వద్ద జాతీయ రహదారి 44పై ఆదివారం సాయంత్రం ఓ ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ వైపు వెళ్తున్న వాహనంలో ఉన్న కంటైనర్ బెల్ట్ తెగి కారు మీద పడిందని స్థానికులు చెబుతున్నారు. అయితే, అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారు డోర్ తెరిచి బయటకు దిగడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.