TG: మీర్‌చౌక్ అగ్నిప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతిచెందారు. స్పాట్లో ముగ్గురు చనిపోగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 14 మంది చనిపోయారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. తెల్లవారుజామున ఓ భవనంలో మంటలు చెలరేగగా.. దట్టమైన పొగ కమ్ముకుంది. ఈ పొగతో ఊపిరాడక పలువురు చనిపోయారు.