IPL: వర్షం కారణంగా MI, గుజరాత్ మధ్య జరుగుతున్న మ్యాచ్కు అంతరాయం కలిగింది. మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తున్న వాంఖడే స్టేడియం పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో గ్రౌండ్ సిబ్బంది మైదానాన్ని కవర్లతో కప్పారు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ దిగిన GT 14 ఓవర్లు.. 107/2గా ఉంది.