ఐపీఎల్ అభిమానులకు గుడ్న్యూస్. 2028 నుంచి ఐపీఎల్లో మ్యాచ్ల సంఖ్య పెరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రతి సీజన్లో 74 మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. అయితే, 2028 నుంచి మరో 20 మ్యాచ్లు పెంచాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ వెల్లడించారు. అయితే, దీనిపై త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.