SKLM: టెక్కలి నియోజకవర్గంలో ఉన్న మదన గోపాలసాగరం వంశధార ఎడమ ప్రధాన కాలువ రిజర్వాయర్ను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు మంగళవారం సందర్శించారు. అనంతరం టెక్కలి నియోజకవర్గం ఇరిగేషన్ ప్రాజెక్ట్ సమస్యల పై మంత్రికి వివరించారు. ఇందులో నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, జిల్లా కలక్టర్, అధికారులు ఉన్నారు.