TPT: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి జన్మనక్షత్రమైన ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సోమవారం రాత్రి అమ్మవారు గజ వాహనంపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ప్రతి ఉత్తరాషాడ నక్షత్రం రోజున అమ్మవారికి గజ వాహన సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ నయన మనోహరంగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.