HNK: కాజీపేట పట్టణం మడికొండలోని దుర్గాభాయ్ దేశ్ముఖ్ మహిళా ప్రాంగణంలో శుక్రవారం చెట్లకు అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాద సమయంలో ప్రాంగణంలో ఉన్న సుమారు 100 మంది విద్యార్థినులు సురక్షితంగా బయటపడ్డారు.