నిరంతరం కళ్లజోడు ధరించడం వల్ల ముక్కుపై ఏర్పడే నల్లటి మచ్చలను సహజ చిట్కాలతో సులభంగా తగ్గించుకోవచ్చు. కలబంద రసం లేదా కలబంద జెల్‌ను మచ్చలు ఉన్న చోట అప్లై చేయాలి. కీరా, బంగాళాదుంప, టమాటా రసాలను కలిపి రాసి, ఆరిన తర్వాత క్లీన్ చేసుకోవాలి. నారింజ తొక్కల పొడిలో పాలు లేదా పెరుగు కలిపి ప్యాక్‌లా వేసుకుని కొంతసేపటికి క్లీన్ చేస్తే బెటర్.