ATP: ఒడిశా రాష్ట్రానికి చెందిన భగభాన్ పాలై అనే వ్యక్తికి గుంతకల్లు కోర్టు 10 ఏళ్లు జైలు శిక్ష విధించింది. 2023లో గుంతకల్లు రైల్వే స్టేషన్లో గంజాయి తరలిస్తూ రైల్వే పోలీసులకు నిందితుడు పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి 32 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. బుధవారం కోర్టుకు హాజరుపరచగా ముద్దాయికి 10 ఏళ్లు జైలు శిక్ష విధించింది.