NLR: సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు వేదాయపాళెంలోని కార్యాలయం వద్ద బుధవారం మెగా రక్తదాన శిబిరం జరిగింది. ఈ సందర్భంగా సోమిరెడ్డి తనయుడు రాజగోపాల్‌రెడ్డితో పాటు 153 మంది యువకులు రక్తదానం చేశారు. ప్రాణంతో సమానమైన రక్తదానం చేసిన ప్రతి ఒక్కరినీ ఎమ్మెల్యే అభినందించారు.