Sharukh Daughter:కూతురు సుహానా ఖాన్, అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా ప్రేమలో ఉన్నారా? అంటే ఔననే అంటోంది సోషల్ మీడియా. ఇటీవల వీరు తరచూ కలిసి కనిపించారు. ఓ బర్త్ డే వేడుకలో కూడా సుహానాకు అగస్త్య ప్లైయింగ్ కిస్ ఇచ్చాడు.
Sharukh Daughter Suhana Khan And Agastya Nanda DATING?
Sharukh Daughter:బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ (Sharukh Khan) ముద్దుల తనయ సుహానా ఖాన్ (Suhana Khan) ప్రేమలో పడిందా? అంటే ఔననే అంటోంది సోషల్ మీడియా. వీరిద్దరూ తరచూ కనబడటం.. కనబడిన ప్రతీసారి.. ఓవర్ రియాక్ట్ కావడంతో వీరి మధ్య ఏదో ఉందనే సందేహాం వస్తోంది. వీరిద్దరూ మంచి స్నేహితులు.. కానీ అగస్త్యే (Agastya Nanda) తమ విషయాన్ని రివీల్ చేశాడు. లవ్‌లో ఉన్నామని అగస్త్య పలువురికి తెలుపడంతో అలా విషయం బయటకు తెలిసింది. అప్పటినుంచి ఇద్దరూ ఉంటే.. చాలు అక్కడ సీన్ క్రియేట్ అవుతుంది.
సుహానా-అగస్త్య (Agastya Nanda) కలిసి ‘ఆర్చిస్’ అనే మూవీలో నటిస్తున్నారు. దీనికి సంబంధించి జోయా అక్తర్ ప్రకటన చేయడంతో వీరి మధ్య ఏదో ఉందనే అనుమానం వచ్చింది. సుహానా-అగస్త్య (Agastya Nanda) గురించి వారి పేరంట్స్కు (parents) కూడా తెలుసని రూమర్లు వచ్చాయి. ఇంతలో సునీల్ శెట్టి (sunil shetty) కుమారుడు అహాన్ శెట్టి (ahan shetty) భార్య తానియా శెట్టి (tania shetty) బర్త్ డే జరిగింది. ఆ పార్టీకి చాలా మంది వచ్చారు. వారిలో సుహానా-అగస్త్య (Agastya Nanda) కూడా ఉన్నారు.
పార్టీకి వచ్చి సుహానా (Suhana Khan) వెళ్లిపోతుంది. సుహానా (Suhana Khan) కారు వద్దకు అగస్త్య వచ్చాడు. బై చెప్పడంతోపాటు.. అగస్త్య ప్లైయింగ్ కిస్ ఇచ్చాడు. ఆమె కూడా చేతులూపి బై చెప్పింది. నిజానికి తానియా సుహానా బై చెప్పింది. కానీ ఆ వీడియోలో అగస్త్య అతి చేశాడని తెలుస్తోంది.
కరణ్ జోహార్ క్రిస్మస్ వేడుకలో సుహానాతో (Suhana Khan) తన బంధాన్ని అగస్త్య తెలియజేశారు. వీరి గురించి అగస్త్య తల్లి శ్వేతా బచ్చన్‌కు కూడా తెలుసు.. ఈమె అమితాబ్ బచ్చన్ కూతురు అనే సంగతి తెలిసిందే. సుహానా-అగస్త్య (Agastya Nanda) ప్రేమకు ఆమె కూడా సపోర్ట్ చేశారని.. వీరిద్దరూ కలిసి చాలాసార్లు హోటళ్లలో భోజనం కూడా చేశారని పుకార్లు వచ్చాయి.