ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే సమంత.. ఒక్కసారిగా మయోసైటిస్ అనే వ్యాధి సోకినట్లు సోషల్ మీడియాలో చెప్పడంతో.. అభిమానులంతా షాక్ అయ్యారు. అది కూడా డబ్బింగ్ స్టూడియో నుంచి సెలైన్ బాటిల్ ఎక్కుతున్న ఫోటో షేర్ చేయడంతో సమంతకు సీరియస్‌గానే ఉన్నట్టు అర్థమవుతోంది. దాంతో సామ్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు ఆమె అభిమానులు. ఇక చాలా మంది ఇండస్ట్రీ ప్రముఖులు సమంత(Samantha) త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఎన్టీఆర్.. మెగాస్టార్ చిరంజీవిలతో పాటు చాలామంది హీరోలు సమంత కోలుకోవాలని ప్రార్థించారు.
దీనిపై అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ కూడా స్పందించారు. ముందుగా సుశాంత్ స్పందించాడు. ఆ తర్వాత అక్కినేని అఖిల్.. డియర్ సామ్ అందరి ప్రేమ మరియు బలం నీకు అందుతుంది.. గెట్ వెల్ సూన్ అని రాసుకొచ్చాడు. అయితే దీనిపై నాగార్జున, నాగ చైతన్య కూడా స్పందిస్తారా అని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ వక్తిగతంగా సమంతను కలవడానికి సిద్ధమవుతున్నారనే న్యూస్ వైరల్‌గా మారింది. ఈ విషయంలో క్లారిటీ లేకపోయినా నాగ్ మాత్రం సమంతను కలవడం ఖాయమంటున్నారు.
అయితే చైతూ సమంతను కలుస్తాడా.. అనేది ఆసక్తికరంగా మారింది. కానీ ఇప్పటి వరకు అసలు సోషల్ మీడియాలో కూడా స్పందించని చై(Naga Chaitanya).. సామ్‌ను కలవడం సాధ్యమేనా అనే సందేహాలు వెలువడుతున్నాయి. విడాకుల తర్వాత ఈ ఇద్దరు ఎదురు పడిన సందర్భాలు లేవు. అలాంటి సమయంలో సమంత కావాలనే షూటింగ్‌లను పోస్ట్ పోన్ చేయించదనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ప్రస్తుత పరిస్థితులు వేరు.. కాబట్టి దీనిపై చైతూ స్పందించాలని అంటున్నారు అభిమానులు. మరి నిజంగానే చైతన్య-సమంత కలుస్తారేమో చూడాలి.