YS Sharmila:తెలంగాణ సీఎం కేసీఆర్‌పై (CM KCR) వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ధ్వజమెత్తారు. తనకు లుక్ అవుట్ నోటీసు ఆర్డర్ (lookout notice order) ఇచ్చినట్టు తెలిసిందన్నారు. తనకు నోటీసు ఇవ్వడం ఏంటీ…? తానేమైనా క్రిమినలా ? అని అడిగారు. ఆర్థిక నేరగాళ్లు, దేశం నుంచి పారిపోయిన క్రిమినల్స్‌కు (criminals) మాత్రమే లుక్ అవుట్ నోటీసులు జారీచేస్తారు. ఇదే విషయాన్ని షర్మిల (YS Sharmila) ప్రస్తావించారు.
TSPSC పేపర్ లీకేజీ విషయంలో (paper leak) అసలు దొంగలను వదిలేశారని.. చిన్న, చితక వారిని దోషులుగా చిత్రీకరిస్తున్నారని షర్మిల (YS Sharmila) మండిపడ్డారు. కమిషన్ ముందు ఆందోళన చేపడితే చాలు హౌస్ అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. తను బయటకు వెళ్ళాలి అంటే ఇతర కారణాలు చూపించి.. హౌస్ అరెస్ట్ (house arrest) చేస్తున్నారని పేర్కొన్నారు. నిరుద్యోగులకు న్యాయం చేయాలని.. నిన్న రాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చానని గుర్తుచేశారు.హోటల్ గదిలో (hotel room) తలదాచుకుని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తన ఇంటి ముందు వందలాది మంది పోలీసులను ఎందుకు మొహరించారని షర్మిల (YS Sharmila) అడిగారు. ఇల్లు (home), పార్టీ కార్యాలయం (party office) ముందు భారీగా పోలీసులను మొహరించారని తెలిపారు.
సిట్ (sit) విచారించే ఏ కేసు అయినా నీరుగారిపోతుందని వైఎస్ షర్మిల (YS Sharmila) అన్నారు. సిట్ వద్దు సీబీఐ (cbi) చేత విచారించాలని కోరినా ప్రభుత్వం వినడం లేదన్నారు. కమిషన్ కార్యాలయం ముట్టడించేందుకు వస్తే అడ్డుకుంటున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ నియంత అని ధ్వజమెత్తారు. నిరుద్యోగుల కోసం తమ పార్టీ పోరాడతుందని షర్మిల పేర్కొన్నారు. ప్రతీ మంగళవారం నిరుద్యోగుల కోసం దీక్ష చేశామని గుర్తుచేశారు. నిరుద్యోగుల పక్షాన తమ పార్టీ పోరాడుతుందని తెలిపారు. ప్రగతి భవన్ వద్ద ధర్నా చేపడుదామని విపక్షాలకు షర్మిల పిలుపునిచ్చారు. తనతో కలిసి రావాలని కోరారు.