NRML: జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో 8 ,9 తరగతుల బాలికలకు బేటి బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలను నిర్వహించాలని డీఈవో రామారావు తెలిపారు. ఈ నెల 4న పాఠశాల స్థాయిలో, 5న మండల స్థాయిలో, 6న జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించాలని సూచించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందించడం జరుగుతుందన్నారు.